Asha Pasham Song Lyrics in Telugu - C/O Kancharapalem

 Asha Pasham Song Lyrics in Telugu - C/O Kancharapalem

C/O Kancharapalam is directed by Maha Venkatesh. The Movie is Cult Classic with all bonding human relations with simplicity. It is the most positive buzz created Telugu cinema on OTT as well in theaters with simple yet elegant tale of multiple love stories portraiture in one film.

Director Maha Venkatesh has crafted in a all acceptable manner of a film that projects various emotions in a heart-warming manner. Asha Pasham Song is emotional and yet finding the real essence on individual life. If you are looking to get  ఆశ పాశం బందీ సేసేలే… సాగే కాలం ఆడే ఆటే లే here is Telugu Lyrics of this song.

Asha Pasham Song Telugu Lyrics

ఆశ పాశం బందీ సేసేలే… సాగే కాలం ఆడే ఆటే లే
తీరా… తీరం సేరేలోగానే… ఏ తీరౌనో…

సెరువైనా సేదూ… దూరాలే….
తోడౌతూనే ఈడే… వైనాలే…
నీదో కాదో… తేలేలోగానే ఏదేటౌనో…
ఆటు పోటు గుండె మాటుల్లోనా… సాగేనా…

ఏ లేలేలేలో… కల్లోలం ఈ లోకంలో…
లోలో లోలోతుల్లో… ఏ నీలో ఎద కొలనుల్లో…

నిండు పున్నమేళ… మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే… నీ గమ్యం గందరగోళం…

దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు… పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం…

ఏ హేతువు నుదుటి… రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా…
రేపేటౌనో తేలాలంటే.. ఈ ఉనికి ఉండాలిగా…
ఓ ఓ… ఆటు పోటు గుండె మాటుల్లోనా…
సాగేనా…

ఆశ పాశం బందీ సేసేలే… సాగే కాలం ఆడే ఆటే లే
తీరా… తీరం సేరేలోగానే… ఏ తీరౌనో…

ఏ జాడలో… ఏమున్నదో… క్రీనీడలా విధి వేచున్నదో….
ఏ మలుపులో… ఏం దాగున్నదో…
నీవుగా… తేల్చుకో… నీ శైలిలో

సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న…
లోకమంటె పెద్ద నాటకమే… తెలియకనే సాగే కధనం…
నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని…
పక్కదారి బట్టి పోతుంటే… కంచికి నీ కధలే దూరం…

నీ సేతుల్లో ఉంది… సేతల్లో సూపించి…
ఎదురేగి సాగాలిగా…
రేపేటౌనో తేలాలంటే… నువ్వెదురు సూడాలిగా…

ఓ ఓ… ఆటు పోటు గుండె
మాటుల్లోన… ఉంటున్నా…



0 Comments